రైతులు ఆరుగాలం పండిచిన పంట చేతికొచ్చేసరికి ప్రకృతి కన్నెర్ర చేసింది. ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించి అన్నదాతను ఆగం చేశాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో కురిసిన అకాల వర్షానికి కల్లాలపై ఆరబెట్టిన ధాన్యం, మొక్కజొన్న, సోయాబీన్ ఎక్కడికక్కడ తడిసిముద్దయ్యాయి.
ఇప్పుడిప్పుడే జోరందుకున్న వరికోతలు వర్షం కారణంగా నీటపాలయ్యాయి. పంట నీటమునిగి తీవ్రంగా నష్టపోయామని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరారు.
ఇదీ చూడండి: భారీ వర్షాలకు పొంగుతున్న వాగులు... ప్రమాదకరంగా రహదారులు