నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో తెలంగాణ నవ నిర్మాణ్ విద్యార్థి సేన ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. జానకంపేట్ నుంచి బాసరకు వెళ్లే రహదారి మరమ్మత్తులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పనులలో జాప్యంతో అనేక మంది రోడ్డు ప్రమాదాలకు గురై, ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
ఇవీచూడండి: క్షేత్రస్థాయి పంచాయతీ అధికారులతో రేపు సీఎం సమావేశం