కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసేస్తోంది. ప్రజలంతా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి కాలంలో వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది, అధికారులు ఇలా చాలా మంది.. వైరస్ బారిన పడకుండా తమను తాము కాపాడుకోవడానికి పీపీఈ కిట్‌ను ధరిస్తున్నారు.
అయితే ఈ పీపీఈ కిట్లు కేవలం మెడికల్ దుకాణాల్లోనే లభించేవి. కానీ తాజాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ బట్టల దుకాణం ముందున్న బొమ్మకు పీపీఈ కిట్‌ను అలంకరించి విక్రయానికి పెట్టారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బట్టల కన్నా పీపీఈ కిట్లకే డిమాండ్ పెరుగుతున్నందున ఇలా పీపీఈ కిట్లను అమ్మకానికి పెట్టినట్లు యజమాని తెలిపారు.