మామిడిపల్లి రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ స్తంభించింది. రైలు వస్తుందని సిబ్బంది గేటు వేశారు. అరగంట పాటు రైలు రాలేదు. గేట్ మూసి ఉంచడం వల్ల రెండు వైపులా కిలో మీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రయాణికులు, వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు. గేటు వేసిన అరగంట తర్వాత రైలు రావడం వల్ల గేటు తీశారు. ఆ తర్వాత వాహనదారులు వెళ్లిపోయారు.
ఇవీ చూడండి: ట్రా'ఫికర్': పంతంగిలో కిలోమీటరు మేర స్తంభించిన వాహనాలు