నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు తగ్గడం వల్ల అధికారులు ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకోవడం వల్ల సెప్టెంబరు 14న నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ వచ్చారు. తాజాగా మహారాష్ట్ర నుంచి వచ్చే వరద ప్రవాహం 12,500 క్యూసెక్కులకు తగ్గిపోవడం తగ్గిపోవడం వల్ల మంగళవారం తెల్లవారు జామున గేట్లు మూసివేశారు.
ప్రస్తుతం జలాశయంలో గరిష్ఠ నీటి మట్టం 1091 అడుగులు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీల వద్ద కొనసాగుతోంది.
ఇదీ చూడండి: వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ వేగవంతం