ధర్మ పరిరక్షణ కోసమే దక్షిణ భారత దేశ యాత్ర చేపట్టినట్లు.. విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి అన్నారు. జిల్లాకు వచ్చిన సందర్భంగా స్వామీజీకి వినాయకనగర్‌లో మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ నేతృత్వంలో స్వాగతం పలికారు. సంజయ్ నివాసంలో రాజ శ్యామల యాగము పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పీఠం ఉత్తరాధికారి ప్రస్తావిస్తూ సంస్కృతికి కొలువైన ఆలయాలను కాపాడుకోవాలని అన్నారు. నగర ప్రముఖులు వివిధ సంఘాల ప్రతినిధులు భక్తులు దర్శించుకున్నారు. అనంతరం ఆయన నీలకంఠేశ్వరుని ఆలయాన్ని సందర్శించారు.
ఇదీ చూడండి: ముంబయి దాడికి 11 ఏళ్లు- అమరులకు ఘన నివాళులు