ETV Bharat / state

వీర జవాన్ మహేశ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు - నిజామాబాద్ జిల్లా తాజా వార్తలు

కశ్మీర్​ ఎదురుకాల్పుల్లో అమరుడైన జవాన్ మహేశ్ భౌతికకాయం కాసేపట్లో ఆయన స్వగ్రామం కోమన్​పల్లికి చేరనుంది. బుధవారం అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే అధికారులు శ్మశానవాటికలో ఏర్పాట్లు మొదలుపెట్టారు. పలువురు ఆర్మీ అధికారులు వేల్పూర్ మండల కేంద్రానికి చేరుకున్నారు.

soldier mahesh cremation Arrangements at kompally in nizamabad
వీర జవాన్ మహేశ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు
author img

By

Published : Nov 10, 2020, 3:18 PM IST

Updated : Nov 10, 2020, 3:59 PM IST

జమ్ముకశ్మీర్ ఉగ్రదాడి​లో వీర మరణం పొందిన మహేశ్​ అంత్యక్రియలు నిజామాబాద్ జిల్లాలోని ఆయన స్వగ్రామైన కోమన్​పల్లిలో జరగనున్నాయి. అధికారులు ఇప్పటికే శ్మశాన వాటికను పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మహేశ్ భౌతికకాయం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంది. కాసేపట్లో స్వగ్రామమైన కోమన్​పల్లికి చేరనుంది

బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి మృతదేహాన్ని కోమన్​పల్లికి తీసుకురానున్నారు. గ్రామస్థులు, బంధువులు, ఇతరుల సందర్శనార్థం అందుబాటులో ఉంచనున్నారు.

రేపు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆర్మీకి సంబంధించిన అధికారులు వేల్పూర్ మండల కేంద్రానికి చేరుకున్నారు.

ఇదీ చదవండి:'చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలన్న తపనే'

Last Updated : Nov 10, 2020, 3:59 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.