కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో పోలీసులు ఆంక్షలు విధించారు. బోధన్ రెవెన్యూ డివిజన్లో 10 పాజిటివ్ కేసులు నమోదైనందువల్ల బోధన్ పట్టణాన్ని కంటోన్మెంట్గా గుర్తించి పట్టణంలోకి ఎవరిని రానివ్వకుండా రహదారులు మూసివేశారు.
బోధన్ పట్టణ ప్రవేశమార్గం అయినటువంటి ఆచన్పల్లి వద్ద బారికేడ్లు పెట్టి రాకపోకలను నియంత్రిస్తున్నారు. పట్టణంలోని శక్కర్ నగర్, రాకాసిపేట్ ఏరియాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నమోదు అవ్వడం వల్ల పోలీసులు పకడ్బందీగా పహారా కాస్తున్నారు.
ఇదీ చూడండి: తగ్గుతున్న వాయుకాలుష్యం.. తేటపడుతున్న నగరాలు