బాల్కొండలోని శ్రీకృష్ణ మందిరంలో గురువారం నుంచి భగవద్గీత పారాయణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు శ్రీభగవద్గీత పారాయణం, సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాల గురించి వివరించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ఈనెల 24న గీతా మహాయగ్నం నిర్వహించి అన్నదానం చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
ఇదీ చూడండి: ఈతకని వెళ్లి.. అనంతలోకాలకు..