Ramoji foundation: రామోజీ ఫౌండేషన్ అందించే ప్రతి ఒక్క రూపాయి పిల్లల బంగారు భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు రామోజీ ఫౌండేషన్, ఈనాడు యాజమాన్యానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థులకు ఈనాడు అందిస్తున్న సహాయం చాలా గొప్పదన్నారు. మానవతా సదన్‌కు సాయం చేయడం చాలా ఆనందదాయకంగా ఉందని తెలిపారు.
2 లక్షల విలువైన విద్యాసామగ్రి అందజేత
Ramoji foundation Help: నిజామాబాద్ డిచ్పల్లి మండల కేంద్రంలోని మానవతా సదన్‌లో చదువుతున్న 106 మంది విద్యార్థులకు రూ.2 లక్షల విలువైన విద్యా, వంట సామగ్రిని రామోజీ ఫౌండేషన్ తరఫున అందజేశారు. కలెక్టర్ నారాయణ రెడ్డి చేతులమీదుగా వాటిని పంపిణీ చేశారు. రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సాయం అందిస్తున్నందుకు కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈనాడు యాజమాన్యం అనేక రకాలుగా వివిధ రంగాల్లో సేవలను అందిస్తోందని నారాయణరెడ్డి కొనియాడారు. వారు అందిస్తున్న సామాజిక సేవల గురించి మనం అనేక సందర్భాల్లో చూస్తున్నామని తెలిపారు.
'మీరు చేస్తున్న కార్యక్రమం చాలా అభినందనీయం. మీరిచ్చే ప్రతి రూపాయి కూడా 100 శాతం ఉపయోగపడతుంది. ఈ సందర్భంగా రామోజీ ఫౌండేషన్‌కు, ఈనాడు యాజమాన్యానికి ధన్యవాదాలు. పిల్లల భవిష్యత్తుకు తోడ్పడుతున్న మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. అప్పటి కలెక్టర్ ఒక మంచి ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించారు. పిల్లలకు అవసరమైన వాటిని అందించడం చాలా హర్షణీయం. విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో రాణించాలని కోరుకుంటున్నా.'
- నారాయణ రెడ్డి, నిజామాబాద్ కలెక్టర్
eenadu unit nizamabad: స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం విశిష్ట అతిథి చేతుల మీదుగా అందించాలనే ఉద్దేశంతోనే కలెక్టర్‌ను ఆహ్వానించినట్లు ఈనాడు యూనిట్ ఇంఛార్జి చక్రవర్తి తెలిపారు. వారి చేతుల మీదుగా విద్యార్థులకు సామగ్రిని అందించినందుకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.
- ఇదీ చూడండి:
- Ramoji foundation: హయత్‌నగర్ ఫైర్‌స్టేషన్ నిర్మాణానికి రామోజీ ఫౌండేషన్ చేయూత
- Ramoji Foundation: రామోజీ ఫౌండేషన్ దాతృత్వం.. వృద్ధాశ్రమానికి అవసరమైన సామగ్రి అందజేత
- RAMOJI FOUNDATION: నాగన్ పల్లిలో 176 మంది మహిళలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ
- Ramoji Foundation: అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణాకు శంకుస్థాపన.. రామోజీ ఫౌండేషన్‌కు మంత్రుల కృతజ్ఞతలు