నిజామబాద్ జిల్లా భీంగల్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డు, కొత్త బస్టాండ్ సమీపంలోని పలు కాలనీలు గత నాలుగైదు రోజులుగా కురిసిన వర్షాలకు నీట మునిగాయి. విష పురుగులు, పాములు, దోమల భయంతో కాలనీ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. స్థానికులంతా కలిసి మున్సిపల్ కమిషనర్‌కి ఎన్నిసార్లు సమాచారం అందించినా, గతంలో సైతం పలుమార్లు వినతి పత్రం అందించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని కాలువలోని చెత్తను తొలగించి, వర్షం నీటిని కాలువల ద్వారా దారి మళ్లించాలని కోరుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే.. ప్రతీ ఏదాడి ఈ సమస్య తలెత్తుతున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి : పిల్లల అమ్మకాలకు ఏజెంట్ వ్యవస్థ.. 'సృష్టి'oచిన ఆసుపత్రి