ఇంటింటికి తిరుగుతూ చెక్కులు అందజేత నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో మంగళవారం నాడు తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటింటికి తిరుగుతూ అర్హులైన వారికి కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ పథకాల ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ఇలాంటి పథకం ప్రవేశపెట్టడం కేసీఆర్ ఘనతని అభిప్రాయపడ్డారు. కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకాల ద్వారా అన్ని జిల్లాల్లో కలుపుకొని సుమారుగా 5 లక్షల మందికి ప్రయోజనం చేకూరిందని పోచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి: తెలంగాణ కాంగ్రెస్లో "అధ్యక్ష" పదవి లొల్లి