నిజామాబాద్‌లోని హైమదీబజార్ ప్రాంతంలో ప్రజలు గుంపుగుంపులుగా చేరారు. మాంసం, కిరాణ, ఇతర దుకాణాల వద్ద ఇబ్బడిముబ్బడిగా నిలబడ్డారు. సామాజిక దూరం సంగతే పట్టించుకోవడం లేదు. మాస్కులు కూడా ధరించకుండా వచ్చారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీలకు పని చెప్పారు. పోలీసుల భయంతో కొంతమంది అక్కడి నుంచి వెళ్లినా రద్దీ మాత్రం తగ్గలేదు.
ఎల్లారెడ్డిలో...
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఆదివారం సంత కావడం వల్ల జనాలు పోటెత్తారు. మాంసం, కిరణం దుకాణాలు తీయడం వల్ల సామాజిక దూరం మరిచి కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల ఆర్డీవో దేవేందర్ రెడ్డి, తహసీల్దార్ స్వామి, సీఐ రాజశేఖర్ అక్కడికి చేరుకొని జనాలను చెదరగొట్టారు. కిరాణా దుకాణాలు మూసి వేయించారు.
నవిపేట్‌లో...
నిజామాబాద్ జిల్లా నవిపేట్‌లో మాంసం కోసం వచ్చిన జనాలు సామాజిక దూరం పాటించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి లాఠీలకు పని చెప్పారు.
ఇదీ చదవండి: కరోనాపై పోరాటానికి విరాళాల వెల్లువ