ETV Bharat / state

పసుపు రైతుకు మద్దతు ధర కష్టాలు

author img

By

Published : Feb 2, 2020, 9:17 AM IST

ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు పొలమే వారి ప్రపంచం. నేల తల్లే వారి జీవితం. కడుపు కట్టుకని పది మంది కడుపు నింపేందుకు అహర్నిశలు కృషి చేసే అపర భగీరథులు. ప్రకృతి సహకరించినా.. సహకరించికపోయినా.. పంట పండినా.. పండకున్నా.. భూ తల్లినే నమ్ముకున్న విశ్వాసపాత్రులు. తమ పంటకు గిట్టుబాటు ధర లేక ఆవేదన వ్యక్తం చేస్తున్న నిస్సహాయులు. వారే యవత్​ ప్రపంచానికి అన్నం పెడుతున్న అన్నదాతలు.

no minimum price to turmeric  crop
పసుపుకు రైతుకు మద్దతు ధర కష్టాలు

రైతులకు గిట్టుబాటు ధర అందేలా చూస్తాం.. ఇతర రాష్ట్రాల మార్కెట్లతో మన మార్కెట్‌ను అనుసంధానిస్తాం.. వ్యాపారుల నడుమ పోటీతత్వం సృష్టించి సరకుకు డిమాండ్‌ ఉండేలా చేస్తాం’’ పసుపు పంట విషయంలో కొంతకాలంగా అధికారులు చెబుతున్న మాటలివీ.. ఇక క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనిస్తే.. కొత్త పసుపు మార్కెట్లోకి రావటం మొదలై ఇరవై రోజులైనా గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

తగ్గిన దిగుబడి

రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షల ఎకరాల్లో ఈ దఫా పసుపును సాగు చేశారు. నిజామాబాద్‌, నిర్మల్‌, కరీంనగర్‌, జగిత్యాల, వరంగల్‌, మహబూబాబాద్‌, వికారాబాద్‌ జిల్లాలో పంట అధికంగా సాగవుతోంది. ఈసారి అధిక వర్షాలకు మర్రాకు, దుంపకుళ్లు సోకడంతో దిగుబడిపై ప్రభావం చూపింది. ఎకరాకు 25 క్వింటాళ్లు రావాల్సి ఉండగా.. 18 నుంచి 20 క్వింటాళ్ల లోపే దిగుబడి పరిమితమైంది.

12 శాతం లోపు తేమతో

నిజామాబాద్‌ మార్కెట్‌కు నిత్యం 2 వేల క్వింటాళ్ల వరకు పంట వస్తోంది. 12 శాతం లోపు తేమతో సరకును తీసుకురావాలని అధికారులు చెబుతున్నారు. అయితే ఎండలు ఇప్పుడిప్పుడే కాస్తుండటంతో భూమిలోంచి తీసి ఉడికించిన పంట ఎండటానికి పది రోజులకు పైగా సమయం పడుతోంది. వ్యాపారి నుంచి ప్రస్తుతం రైతుకు లభిస్తున్న ధర క్వింటాకు కనిష్ఠంగా రూ.4200, గరిష్ఠంగా రూ.4500 మాత్రమే. నిరుడు ఇదే సమయంలో రూ. 4 వేలతో మొదలై.. గరిష్ఠ ధర రూ.6500 పలికింది.

పోరు ఫలితం దక్కేనా..!

మద్దతు ధర కోసం పసుపు రైతులు ఏళ్లుగా పోరాడుతున్నారు. గత పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా రైతులు పోరుబాట పట్టడం.. ఎన్నికల్లో 176 మంది పోటీ చేసిన విషయం తెలిసిందే. అనంతరం పసుపు పంట అభివృద్ధి, రైతుల ప్రయోజనాలపై చర్చలు జరిగాయి. సుగంధద్రవ్యాల బోర్డు, ఉద్యానశాఖ అధికారులు కేంద్ర వాణిజ్యశాఖకు నివేదికను అందించారు. ఇందులో క్వింటా ధర కనీసం రూ.9 వేలు ఉండేలా చూడాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత ముందడుగు పడలేదు.

కొత్త విధానమెప్పుడో..!

ట్రేడ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ ఫర్‌ ఎక్స్‌పోర్ట్‌ స్కీం (టైస్‌) విధానం అమలుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని, భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. తెలంగాణ కేంద్రంగా కార్యాలయం ఏర్పాటు సహా పసుపు పంట అభివృద్ధి, అమ్మకాలు, ఎగుమతులు, రైతు ప్రయోజనాలపై ఇక్కడి నుంచే దృష్టి సారించనుందని తెలిపారు. పసుపు బోర్డు స్థానంలో తీసుకొచ్చే టైస్‌ విధానంతో ప్రయోజనాలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు. అయితే, ఈ విషయమై కేంద్రానికి ముఖ్యమంత్రి లేఖ రాయాలంటూ ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత నిర్ణయం కార్యారూపం దాల్చటానికి ఇంకా ఎంత సమయం పడుతుందనేది తెలియాల్సి ఉంది.

రైతులు ఏమంటున్నారంటే..!

క్వింటాకు కనీసం రూ.10 వేల ధర ఉంటేనే పసుపు సాగు చేసే పరిస్థితి ఉందంటున్నారు రైతులు. ఈ సీజన్‌లో దిగుబడులు తగ్గడం వల్ల పెట్టుబడులు దక్కే పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు. ఎకరం సాగుకు రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు ఖర్చు చేశామన్న అన్నదాతలు పెట్టుబడి రావడం కష్టమంటున్నారు. . పసుపును ఉడికించేందుకు అధునాతన బాయిలర్స్‌నూ రాయితీపై అందించాలి.

ఇదీ చూడండి:- బడ్జెట్​పై భాజపా హర్షం... మోదీ-నిర్మలపై ప్రశంసల వర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.