ETV Bharat / state

బ్లడ్​ బ్యాంక్​లో తగ్గిన నిల్వలు.. రక్తదానం చేసిన యువకులు

కరోనా వ్యాప్తి నివారణకు విధించిన లాక్​డౌన్​ వల్ల రెడ్​క్రాస్​ బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వలు తగ్గిపోయాయి. నిజామాబాద్​ నగరంలోని రెడ్​ క్రాస్​ సొసైటీలో రెడ్​ పాంథర్స్ యూత్, గోవూరు గ్రామానికి చెందిన యువకులు రక్తదానం చేశారు.

nizamabad youth donated blood for red cross blood bank
రెడ్​క్రాస్​ బ్లడ్​బ్యాంక్​కై నిజామాబాద్​ యువత రక్తదానం
author img

By

Published : Aug 23, 2020, 5:39 PM IST

లాక్​డౌన్​ వల్ల రెడ్​క్రాస్​ బ్లడ్ బ్యాంక్​లో తగ్గిపోయిన రక్త నిల్వలు పెంచడానికి నిజామాబాద్​ యువత ముందుకొచ్చింది. గోవూరు గ్రామానికి చెందిన రెడ్​ పాంథర్స్​ యూత్​ అసోసియేషన్​ సభ్యులు రక్త దానం కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రెడ్​క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, గోవూరు గ్రామ సర్పంచ్ నరేందర్ రెడ్డితో పాటు మరో 17 మంది యువకులు రక్త దానం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు, గర్భిణీలు రక్త నిల్వలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజశేఖర్ అన్నారు. వారి అవసరాన్ని అర్థం చేసుకుని రక్త నిల్వలు పెంచేందుకు ముందుకొచ్చి శిబిరాన్ని నిర్వహించిన యువతను అభినందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.