నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో చేపట్టిన పట్టణ ప్రగతి పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ లత పరిశీలించారు. వీధుల్లో తిరుగుతూ.. పనులపై ఆరా తీశారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా పట్టణంలోని శంకర్‌నగర్ కాలనీలో మేకలను వదించడానికి ప్రత్యేక భవనాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు. పట్టణ ప్రగతిలో మిగిలిపోయిన పనులను మరో 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇవీ చూడండి: అక్కడ చిక్కుకున్న విద్యార్థులను కాపాడండి: కేటీఆర్