నిజామాబాద్ జిల్లా బాల్కొండ, ముప్కాల్, పోచంపాడులలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను జిల్లా విద్యాధికారి దుర్గా ప్రసాద్ తనిఖీ చేశారు. ఆగష్టు 3న ప్రచురితమైన ముక్కిన బియ్యం కథనానికి విద్యాశాఖ స్పందించి.. వెంటనే ఆయా పాఠశాలల్లో తనిఖీలు చేశారు. మధ్యాహ్న భోజన బియ్యం బాగున్నాయని తెలిపారు. బాల్కొండలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అధికారుల ఆదేశాల మేరకు బియ్యం పరిశీలన చేశామని,బియ్యం నాణ్యంగానే ఉన్నాయని, పాఠశాలలల్లో నిల్వ ఉన్న బియ్యాన్ని ఎంఎల్‌ఎస్ గోదాంకు పంపించనున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇంకా పాఠశాలలు తెరుచుకోవడం లేదని, విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలన్న ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తామని డీఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ ఉన్నారు.
ఇదీ చూడండి : ఎమ్మెల్యే మృతికి కేసీఆర్, పోచారంతోపాటు మంత్రుల సంతాపం