రైతులకు రుణ మంజూరులో ఉదారంగా ఉండాలని నిజామాబాద్ జిల్లా బ్యాంకర్స్‌కు కలెక్టర్ ఎం. రామ్మోహనరావు సూచించారు. కలెక్టరేట్లోని ప్రగతిభవన్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రాధాన్యత రంగాలకు రుణాల మంజూరులో లక్ష్యాలు సాధించలేదని ఆసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.1751 కోట్లకు గాను 21.58 శాతంతో కేవలం రూ.378 కోట్లు మాత్రమే మంజూరు చేశారన్నారు. కేవలం రుణాలపై పైనే వ్యవసాయం చేసే రైతులు బ్యాంకుల వైపు చూస్తారని తెలిపారు. అన్నదాతలకు బాసటగా నిలవాల్సిన బాధ్యత బ్యాంకుల పైన ఉందన్నారు. పంటల బీమాలపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.
ఇదీ చూడండి: వేదికపై ర్యాంప్‌వాక్ చేస్తూ విద్యార్థిని మృతి!