వ్యవసాయ, రెవెన్యూ, ఉద్యానవన శాఖలతో కలిసి పంట రుణాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. అర్హత ఉన్న రైతులందరూ రుణాలు పొందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిజామాబాద్ కలెక్టరేట్లో జరిగిన డీఎల్ఆర్సీ సమావేశంలో అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
వానాకాలంలో కేవలం 4శాతం, యాసంగిలో అక్టోబర్ వరకు కేవలం 7.74 శాతం మాత్రమే రైతులు రుణాలు పొందారని తెలిపారు. రుణాలు తక్కువగా తీసుకోవడానికి కారణాలను విశ్లేషించగా రైతులు ముందుకు రావడం లేదని బ్యాంకర్స్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ గ్రామాల్లో రైతులు ముందుకు రావడం లేదో వారు రుణాలు పొందేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ జితేష్ వి. పాటిల్, ఎల్డీఎం జయ సంతోషి, నాబార్డ్ డీడీఎం నగేష్, ఎస్బీఐ ఆర్ యమ్ ప్రతాప్ రెడ్డి, ఆర్ సెటీ డైరెక్టర్ సుధీంద్ర బాబు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'అందమైన నగరంగా నిజామాబాద్ని తీర్చిదిద్దుతున్నాం'