ETV Bharat / state

'ప్రతి 1000 మంది జనాభాకు ఒక మెడికల్​ టీమ్​ ఉండాలి' - collector narayan reddy meeting with medical officers

ప్రజారోగ్యం దృష్ట్యా నిజామాబాద్​ జిల్లా వైద్యాధికారులతో కలెక్టర్ నారాయణ రెడ్డి దూరదృశ్య మాధ్యమం ద్వారా సమావేశం నిర్వహించారు. కరోనా తీవ్రత దృష్ట్యా జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రత్యేక వైద్య సిబ్బంది పర్యటించి ప్రజలకు సేవలు అందించాలని కలెక్టర్​ సూచించారు.

collector narayan reddy video confernce with medical officers
వైద్యాధికారులతో కలెక్టర్​ నారాయణ రెడ్డి సమావేశం
author img

By

Published : May 6, 2021, 12:02 PM IST

నిజామాబాద్​ జిల్లా వ్యాప్తంగా ప్రతి 1000 మంది జనాభాకు ఒక మెడికల్​ టీమ్​ ఏర్పాటు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని మండలాల అధికారులు, పీఎహెచ్​సీ, సీహెచ్​సీ, యూపీహెచ్​సీల వైద్యాధికారులతో కలెక్టర్​ వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో సూచనలు, సలహాలు, నియమనిబంధనలపై అధికారులతో చర్చించారు.

రేపటి నుంచి ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఆరోగ్య కేంద్రాల వద్ద మెడికల్​ క్యాంప్ నిర్వహించాలని కలెక్టర్​ ఆదేశించారు. ఓపీ సేవలు అందించాలని పేర్కొన్నారు. గ్రామాల్లోని ఇంటింటినీ మెడికల్​ సిబ్బంది పర్యటించి ప్రజల యోగ క్షేమాలు తెలుసుకోవాలన్నారు. కరోనా కానీ, ఇతర అనారోగ్య సమస్యలేవైనా ఉంటే మందులు అందజేయాలని చెప్పారు.

ఇదీ చదవండి: మహమ్మారితో పోరాడుతున్న పోలీసులు, వైద్యులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.