తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథిని నిజామాబాద్ జిల్లా యంత్రాంగం కలిసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి జిల్లాకు వచ్చిన ఆయనకు కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.
అనంతరం పార్థసారథిని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో కలిశారు. కలెక్టర్, సీపీతో పాటు మున్సిపల్ కమిషనర్ జితేష్ వి. పాటిల్, నిజామాబాద్ ఆర్డీవో రవి, డీపీవో జయసుధ, జడ్పీ సీఈవో గోవింద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ వ్యూహరచన