లాక్ డౌన్‌ను దృష్టిలో పెట్టుకొని నిజామాబాద్ నగర ప్రజలకు ఇంటి వద్దకే కూరగాయలు అందించడానికి.. 13 మొబైల్ కూరగాయల వాహనాలను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. ఈ వాహనాలు నగరంలోని గంగాస్థాన్, వినాయక నగర్, మాధవ నగర్, కాలూరు, గుండారం, ముబారక్ నగర్, అశోక్ నగర్, సుభాష్ నగర్, బోర్గాం తదితర ప్రాంతాల్లో ప్రజలకు కావలసిన వివిధ రకాల కూరగాయలతో తిరుగుతాయని తెలిపారు.
బయటికొచ్చి ఇబ్బంది పడొద్దనే…
లాక్ డౌన్ సడలింపు సమయంలో కూరగాయల కోసం ప్రజలు ఒకేసారి పెద్ద ఎత్తున బయటకు వస్తున్నారని అన్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో పర్యటించి ఇబ్బందులు తెచ్చుకోకూడదనే ఉద్దేశంతోనే ఈ వాహనాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు. ప్రజలు తమ ఇంటి ముందుకు వచ్చే కూరగాయలను తీసుకోవాలని, బయటకు వెళ్లి కరోనా బారిన పడవద్దని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: భారత్‌లో కరోనా.. అంకెల్లో ఇలా...