దేశానికి జవహర్లాల్ నెహ్రూ చేసిన సేవలు మరుపురానివని కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మనల మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన నెహ్రూ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. దేశంలో నదులకు డ్యామ్‌లు నిర్మించి వాటిని ఆధునిక దేవాలయాలుగా పిలిచి... అభివృద్ధికి నాంది పలికిన నేత నెహ్రూ అని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కేశ వేణు, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : పనిమనిషి కొడుకని ఇంట్లోకి రానిస్తే దోచేశాడు!