నిజామాబాద్లో సోమవారం జరిగిన ఓ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నగరానికి చెందిన చెందిన ఆరుగురు యువకులు టీ తాగేందుకు రైల్వే స్టేషన్ సమీపానికి కారులో వచ్చారు. ఓ వ్యక్తి కారులోకి తొంగి చూడటంతో సెల్ఫోన్ దొంగతనం చేశాడని ఆరోపిస్తూ వెంబడించారు. బాధితుడు పరుగెత్తగా.. కారుతో వెంబడించి పట్టుకొని బోధన్ బస్టాండ్ సమీపంలోని సామిల్లోకి తీసుకెళ్లి కర్రతో బలంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడే పడిపోయాడు. కొద్దిసేపటికి మరికొంత మందితో కలిసి వచ్చిన నిందితులు బాధితుడికి నీళ్లు తాగించి వెళ్లిపోయారు. ఆ తర్వాత అతడు అక్కడే మృతిచెందాడు.
సామిల్లో పని చేసే కూలీలు వచ్చిన సమయంలో ఓ వ్యక్తి పడిపోయి ఉండటం గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలాన్ని పరిశీంచి... మృతుడు మహారాష్ట్రకు చెందిన సంజయ్ గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా... కొందరు వ్యక్తులు ఇతన్ని కొట్టి చంపేసినట్లు గుర్తించారు. రెండు రోజుల్లోనే కేసును ఛేందించి ఆరుగురు నిందితులను పట్టుకున్నట్లు ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఇదీ చూడండి: కొడుకుని అతి దారుణంగా హత్య చేసిన తండ్రి