నిజామాబాద్ జిల్లా బోధన్‌లో మున్సిపల్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. 11 వ పీఆర్సీని... కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు అమలుచేసి రూ.24 వేల వేతనం ఇవ్వాలని కోరారు. ఈపీఎఫ్, ఈఎస్సై సదుపాయాలను కల్పించాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: ఎట్టకేలకు గాడినపడ్డ వాట్సాప్, ఇన్‌స్టా