ETV Bharat / state

ఎమ్మెల్యే షకీల్​ దాతృత్వం.. బోధన్​కు నాలుగు అంబులెన్సులు!

author img

By

Published : Aug 21, 2020, 5:18 PM IST

నిజామాబాద్​ జిల్లా బోధన్​ నియోజకవర్గంలో కరోనా పరీక్షలు నిర్వహించడానికి ఎమ్మెల్యే షకీల్​ అమీర్​ రెండు అంబులెన్సులు, బోధన్​ మున్సిపాలిటీకి ప్రత్యేకంగా రెండు అంబులెన్సులు అందించారు. బోధన్​లో ఇకపై విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తామని.. ఫలితాలు వీలైనంత త్వరగా అందిస్తామని ఆయన తెలిపారు.

MLA Shakil Donates Four Ambulances For Bodhan Municipality
ఎమ్మెల్యే షకీల్​ దాతృత్వం.. బోధన్​కు నాలుగు అంబులెన్సులు!

నిజామాబాద్​ జిల్లా బోధన్​ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే షకీల్ అమీర్ కరోనా పరీక్షలు నిర్వహించడానికి ప్రత్యేకంగా ​ రెండు, ​బోధన్​ మున్సిపాలిటీకీ రెండు మొత్తం నాలుగు బోధన్​ మున్సిపాలిటీకీ అంబులెన్సులు అందించారు. జిల్లా అదనపు కలెక్టర్​ లత చేతుల మీదుగా అంబులెన్సులను ఆయన బోధన్​ ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యాధికారులకు అందించారు. అనంతరం కలెక్టర్​తో కలిసి పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. పాన్​ గల్లీలోని ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే, కలెక్టర్​ మొక్కలు నాటారు. బోధన్​ పట్టణంలోని రాకాసిపేట్, పాన్​గల్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇకపై రోజుకు 50, బోధన్​ జిల్లా ఆస్పత్రిలో 100 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని ఆదనపు కలెక్టర్​ తెలిపారు.

ఇదీ చూడండి: నాగార్జునసాగర్​ 4 క్రస్ట్​ గేట్లు ఎత్తిన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.