నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో గత శనివారం వ్యవసాయ క్షేత్రంలో హత్యకు గురైన మమత కుటుంబాన్ని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయం కింద మూడు లక్షల రూపాయలు అందజేశారు.
వాటిని మృతురాలి పిల్లల పేరున బ్యాంకులో డిపాజిట్ చేయాల్సిందిగా సూచించారు. రెండు పడక గదుల ఇల్లుతో పాటు అందుబాటులో ఉంటే రెండెకరాల భూమి మంజూరు చేస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
బాధితులకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. హత్యను రాజకీయం చేసేందుకు ఎంపీ అర్వింద్, మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ అర్వింద్ పై ఘాటు విమర్శలు గుప్పించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా పోయి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.