నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. వేల్పూర్ మండలంలోని కొత్తపల్లిలో నిర్మించే చెక్‌డ్యామ్, పచ్చల నడ్కుడ పెద్దవాగులో నిర్మించే చెక్‌డ్యామ్‌ల నిర్మాణ ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. జానకంపేట్ పెద్దవాగులో నాల్గున్నర కోట్లతో నిర్మించిన చెక్‌డ్యామ్ నిర్మాణాన్ని మంత్రి పరిశీలించారు.
పెద్దవాగు, కప్పలవాగు, కొత్తపల్లి, పచ్చల నడ్కుడ గ్రామాల్లో నిర్మించనున్న చెక్‌డ్యామ్‌ల నిర్మాణ ప్రాంతాలను కాలినడకతో వెళ్లి పరిశీలించారు. రైతులు, కార్యకర్తలతో ముచ్చటిస్తూ.. మంత్రి వాగుబాటలో నడుస్తూ పలు చెక్‌డ్యామ్‌ల నిర్మాణ ప్రదేశాలను పరిశీలించారు.
నిజామాబాద్ జిల్లాలో 72 కి.మీ పొడవు గల వాగులు రెండు ఉండగా.. బాల్కొండ నియోజకవర్గంలోని 42 కి.మీ పొడవున్న వాగుల వల్ల 65 గ్రామాల పరిధిలో సుమారు 25 వేల ఎకరాలకు సాగునీటి ప్రయోజనం అందుతుందని మంత్రి తెలిపారు.
ఇదీ చూడండి : 'అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. అవినీతికి వ్యతిరేకం'