నిజామాబాద్‌లోని సీఎస్ఐ మైదానంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం తరఫున క్రైస్తవులకు విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు.
అన్ని మతాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి ప్రశాంత్ పేర్కొన్నారు. కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం వారికి బట్టలు పంపిణీ చేశారు. అర్హులైన వారందరికి ప్రభుత్వ పథకాలను అందిచాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని మంత్రి తెలిపారు.
- ఇవీచూడండి: గోదావరి గలగల... కాళేశ్వరం కాలువలకు జలకళ