ETV Bharat / state

వెనుకబడిన కులాల అభివృద్ధే సీఎం లక్ష్యం: గంగుల

నిజామాబాద్​లోని ఎమ్మెల్సీ కవిత కార్యాలయంలో 34 బీసీ కుల సంఘాల సమావేశం నిర్వహించారు. వెనుకబడిన కులాల అభివృద్ధే సీఎం లక్ష్యమని మంత్రి గంగుల కమలాకర్​ అన్నారు. బీసీలకు సంక్షేమ ఫలాలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కవిత స్పష్టం చేశారు.

minister gangula and mlc kavitha
మంత్రి గంగుల కమలాకర్​, ఎమ్మెల్సీ కవిత
author img

By

Published : Feb 15, 2021, 5:04 PM IST

వెనుకబడిన కులాలన్నింటినీ అభివృద్ధి పథంలోకి తీసుకురావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల ‌కమలాకర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం​లోని ఎమ్మెల్సీ కవిత క్యాంపు కార్యాలయంలో 34 బీసీ ‌కుల సంఘాల సమావేశం నిర్వహించారు. బీసీల వద్దకే వెళ్లి వారికి కావలసిన వాటినే చట్టాలుగా చేయాలని సీఎం కేసీఆర్ సూచించారని మంత్రి గంగుల తెలిపారు. గత డెబ్బై ఏళ్లలో ఎన్నో ప్రభుత్వాలు మారినా వెనుకబడిన వర్గాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయన్న మంత్రి.. తెరాస ప్రభుత్వం వచ్చాక 261 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని వివరించారు.

బీసీలకు సంక్షేమ ఫలాలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్​లో డ్రైవర్ కమ్ ఓనర్ పథకాన్ని బీసీలకు సైతం వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కవిత విజ్ఞప్తి చేశారు.

బీసీ విద్యార్థుల కోసం గురుకులాలు

ఇదీ చదవండి: బీసీలు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి కాలేదు: ఆర్​.కృష్ణయ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.