నిజామాబాద్ కార్పొరేషన్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులు, ఉద్యోగులకు గురువారం నుంచి మందులు అందించనున్నట్లు మేయర్ నీతి కిరణ్ చెప్పారు. కరోనా మహమ్మారి నగరంలో విజృంభిస్తుండడం వల్ల పారిశుద్ధ్య కార్మికులకు రోగ నిరోధక శక్తి పెంపుదలకు మాత్రలను అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా, సీజనల్ వ్యాధుల నుంచి ప్రతి కార్మికుడిని రక్షించేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పిల్లలను అమ్మగా లాలించండి కానీ... భయపెట్టొద్దు!