ROB Works: ఎప్పుడెప్పుడా అని ఇందూరు ప్రజలు ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న మాధవనగర్ ఆర్వోబీ పనులు ప్రారంభమయ్యాయి. వంతెన నిర్మాణ పనులు దక్కించుకొన్న ఆర్ఎస్వీ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీతో ఒప్పందం పూర్తయ్యింది. నిత్యం ఈ మార్గంలో నిత్యం 50 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. గేటు పడిన ప్రతిసారి 10 నిమిషాల నుంచి అరగంట సమయం పడుతోంది. హైదరాబాద్, కామారెడ్డి మార్గంలో ఉండటంతో వందల వాహనాలు నిలుస్తున్నాయి. అంబులెన్సులు ట్రాఫిక్‌లో చిక్కుకొని బాధితులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి. ఎన్నోఏళ్లుగా ఎదురుచూస్తున్న వంతెన నిర్మాణ పనులు ప్రస్తుతం ప్రారంభంకావడంతో త్వరలో కష్టాలు తీరిపోనున్నాయి.
రెండేళ్ల కాల పరిమితితో వంతెన నిర్మాణం పూర్తి చేయనున్నారు. కిలోమీటరు పొడువు, 150అడుగుల వెడల్పుతో రైల్వేట్రాక్‌పై వంతెన నిర్మించనున్నారు. రూ.90 కోట్ల నిధుల్లో కేంద్రం వాటా రూ.30 కోట్లు కాగా, రాష్ట్ర వాటా రూ.60 కోట్లు. ఈమధ్యే రాష్ట్ర ప్రభుత్వం పాలనా అనుమతులు ఇవ్వడంతో టెండర్ల ప్రక్రియ పూర్తయింది. వంతెన నిర్మాణానికి మాధవనగర్ వద్ద కొంతమేర ప్రైవేటు భూమి సేకరించారు. వంతెన నిర్మించే పరిధిలోని నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. పనులు ప్రారంభం కాగా.. వాహనాల రాకపోకలకు అసౌకర్యం కలగకుండా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు పనులు మొదలు కానుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వంతెన నిర్మాణం పూర్తయితే మాధవనగర్ ప్రాంతమే కాకుండా నిజామాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని ఇందూరువాసులు ఆశిస్తున్నారు.
ఇవీ చదవండి: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఇకపై ఇంటింటికీ బూస్టర్ డోసు!
మరణించిన కొడుకు బతికొస్తాడని 30 గంటలు పూజలు.. ఆ పాము కోసం వేట!