నిజమాబాద్ జిల్లాకి చెందిన తెరాస మైనారిటీ రాష్ట్ర నాయకుడు రహీం షఫీ కుమార్తె వివాహం హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని మాజీద్ ఈ బాకి మసీద్‌లో ఘనంగా జరిగింది. వివాహ వేడుకలకు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్నజీయర్ స్వామి హజరు కావడం విశేషం.
హాజరైన మంత్రి ప్రశాంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
కల్యాణ వేడుకలకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, నిజమాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి, తెరాస నేత తారిక్ అన్సారీ నవీద్, కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రహీం షఫీకి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇవీ చూడండి : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శుల జాబితాలో సీనియర్లకు ఉద్వాసన