నిజామాబాద్లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలు సాయంత్రం కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. ఈ వర్షంతో రైతుల ముఖాల్లో ఆనందం విరిసింది. సుమారు గంటపాటు కురిసిన జోరువానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు, ప్రయాణీకులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. నగరంతో పాటు పలు మండలాల్లో జల్లులు పడ్డాయి. పలు చోట్ల విద్యుత్ అంతరాయంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.
ఇవీ చూడండి: చెన్నై నీటి సమస్యపై స్పందించిన టైటానిక్ హీరో