నిజామాబాద్ జిల్లాలోని మాలపల్లిలో సుమారు రూ.15 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అహ్మద్‌పురా కాలనీకి చెందిన అశ్వాక్, నవాజ్‌లు సంగారెడ్డికి చెందిన ఖయ్యూమ్ వద్ద గుట్కా కొనుగోలు చేసి వివిధ ప్రాంతాలకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గుట్కా రవాణాకు ఉపయోగించిన 3 వాహనాలను స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు అడిషనల్ డీసీపీ శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.
ఇవీ చూడండి: వ్యవసాయరంగ సమస్యలపై దేశవ్యాప్త నిరసన