ETV Bharat / state

లయన్స్​ క్లబ్​ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ - free health checkup under lions club

నిజమాబాద్​ జిల్లా బాల్కొండలో లయన్స్​ క్లబ్ పోర్ట్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ నెలలో 14, 21, 28 తేదీల్లో వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు లయన్స్​ క్లబ్​ అధ్యక్షుడు గంగాధర్​ తెలిపారు.

free health campaign held by lions club at nizamabad district
లయన్స్​ క్లబ్​ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ
author img

By

Published : Nov 7, 2020, 7:28 PM IST

నిజామాబాద్​ జిల్లా బాల్కొండలో లయన్స్​ క్లబ్​ పోర్ట్​ బాల్కొండ, నిజామాబాద్​కు చెందిన ప్రగతి హార్ట్​ సెంటర్​ ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. శిబిరాన్ని ఎంపీపీ లావణ్య ప్రారంభించారు. ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవాలని ఆమె వివరించారు. వైద్యులు గోపికృష్ణ, మహేష్​లు పాల్గొని శిబిరానికి వచ్చిన వారికి గుండె పరీక్షలు చేశారు.

కార్యక్రమంలో భాగంగా 55 మందికి ఉచితంగా ఈసీజీ, 2డీ ఎకో వైద్య పరీక్షలు చేశారు. గుండె జబ్బులపై అవగాహన కల్పించారు. పక్క మండలాల నుంచి రోగులు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. ఈ నెలలో 14, 21, 28 తేదీల్లో వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు లయన్స్​ క్లబ్​ అధ్యక్షుడు గంగాధర్​ తెలిపారు.

ఇదీ చదవండి: పరిశోధన ఫలితాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి: వెంకయ్య నాయుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.