నిజామాబాద్ జిల్లా బాల్కొండలో తహసీల్దార్ అర్చన, ఎంపీడీవో సంతోష్ కుమార్‌లు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. లాక్డౌన్తో పనులు లభించక పేదలు, వలస కూలీలు ఇబ్బంది పడుతున్నారని గ్రహించిన జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి వారికి సాయం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
స్పందించిన మండల విద్యాధికారి, ఇద్దరు ఉపాధ్యాయుల సాయంతో అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో లాక్‌డౌన్ ముగిసే వరకు ఈ కార్యక్రమం కొనసాగిస్తామని విద్యాధికారి తెలిపారు.