లాక్డౌన్ వేళ జీతాలలో కోతను నిరసిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కోత విధించిన జీతాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జీతాల్లో కోతల వల్ల ఈఎమ్ఐలు చెల్లించగా... మిగిలిన డబ్బుతో ఇల్లు గడవడం కష్టంగా మారిందని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తి జీతాలు ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.