ప్రభుత్వం సూచించిన ప్రామాణికాల మేరకు నాణ్యమైన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని డీఆర్డీవో పీడీ రాఠోడ్ రమేశ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం నాగాపూర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. గన్నీ సంచులు, కూలీల కొరత, కొనుగోళ్ల వివరాలను రైతులను, నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
ధాన్యం తూకం వేసే ముందు క్వాలిటీ బృందం వారు పరిశీలించాలని... నాణ్యతగా ఉంటేనే తూకం చేయించాలని చెప్పారు. రైతులు ధాన్యం విక్రయించగానే వారి వద్ద అన్ని వివరాలు సేకరిస్తే... రైతుకు వారం లోపే డబ్బులు ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉందన్నారు. అంతకుముందు గ్రామంలో ఉపాధి హామీ పనులను ఆయన తనిఖీ చేశారు.
ఇవీ చూడండి: మే 17 వరకు లాక్డౌన్.. రాష్ట్రప్రభుత్వ వైఖరిపై ఉత్కంఠ