నిజామాబాద్ నగరంలోని బోయిగల్లీలో గత కొంత కాలంగా ఓ కుక్క కాలనీకి కాపలాగా ఉంటోంది. కొత్తవారు ఎవరువచ్చినా మొరుగుతూ కాలనీ వాసులను అప్రమత్తం చేసేది. ఒంటరిగా వెళ్లే మహిళలకు తోడుగా వెళ్లేది. మార్కెట్కు వెళ్లి ఇంటికి చేరే వరకు వాళ్లను అనుసరిస్తూ వెంట నడిచేది. నమ్మకంగా ఉండటంతో కాలనీవాసులు ఆహారం పెట్టి ఆకలి తీర్చేవారు. అయితే ఆ కుక్క రోడ్డు ప్రమాదంలో మరణించింది. కాలనీ వాసులు ఘనంగా కుక్కకు అంత్యక్రియలు జరిపించారు. సంప్రదాయ బద్ధంగా ఖననం చేశారు.
ఇవీచూడండి: నిధిగా భావించారు... విధిగా ఇంకించారు