నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు రైతులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ప్రతి ఓటు కీలకం కావడం వల్ల అభ్యర్థులూ ఓటర్లను పోలింగ్ కేంద్రం వరకు జాగ్రత్తగా తీసుకొస్తున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 741 డైరెక్టర్ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగనున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇందల్వాయి సహకార సంఘం పరిధిలో 12 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని ఫిర్యాదు రావడం వల్ల అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: మహిళా అధికారికి 'దిశ' అండ.. సిబ్బందికి సీఎం అభినందన