కొవిడ్ రోగులకు వైద్యం అందిస్తున్న పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ తనిఖీలు చేశారు. వైద్య సౌకర్యాలు, రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఉందని వైద్యులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కొవిడ్ కేసులు పెరుగుతున్నందున ఆక్సిజన్ కొరత ఏర్పడిందని... ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
జిల్లాలో రోజురోజుకూ కొవిడ్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయని అడిషనల్ కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని... అత్యవసరం అయితే తప్ప బయటకురావొద్దని.. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి: 'ఫోన్ ద్వారా సమాచారమిస్తే.. ఇంటికే వచ్చి కరోనా పరీక్షలు'