ETV Bharat / state

అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరు: కాంగ్రెస్‌ - congress leaders arrest

అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ పిలుపు మేరకు చలో ప్రగతి భవన్‌ కార్యక్రమానికి వెళ్తున్న జిల్లా కాంగ్రెస్‌ నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

congress leaders arrest in nizamabad district
అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరు: కాంగ్రెస్‌
author img

By

Published : Sep 18, 2020, 1:33 PM IST

మొక్కజొన్న రైతుల ఆవేదన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్న నాయకులు, రైతులను అరెస్ట్‌ చేయడం హేమమైన చర్య అని నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు మనాల మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ పిలుపు మేరకు చలో ప్రగతి భవన్ కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్‌ నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు.

ప్రభుత్వ మద్దతు ధర 1850 రూపాయలు ఉంటే దళారులు 1000 రూపాయలకే క్వింటాలు కొనుగోలు చేస్తూ రైతు బలహీనతపై దెబ్బకొడుతున్నారు. ప్రభుత్వం రైతుకు అండగా నిలవకపోవడం వల్ల దళారుల ఆగడాలకు అంతులేకుండాపోయిందని ఆయన ఆరోపించారు. వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఆసరాగా నిలవాల్సిందిగా డిమాండ్ చేశారు.

జిల్లా ప్రజాప్రతినిధులు స్పందించాల్సిన సమయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం రైతులపై వారు చూపిస్తున్న వ్యతిరేక భావానికి నిదర్శనం అన్నారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని.. గతంలో పసుపు రైతుల ఉద్యమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు గుర్తుచేసుకోపాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: వర్షం వస్తే... ఈ ఊరు జలదిగ్బంధం అవుతుంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.