kcr nizamabad tour: నిజామాబాద్ సమీకృత కలెక్టరేట్ భవనం అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టరేట్‌తో పాటు తెరాస జిల్లా పార్టీ కార్యాలయాన్నీ సీఎం ప్రారంభించారు. నిజామాబాద్ బైపాస్ రోడ్డు ప్రాంతంలో సువిశాల విస్తీర్ణంలో కలెక్టరేట్ నిర్మించారు. 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.60 కోట్ల వ్యయంతో భవనం రూపుదిద్దుకుంది. కలెక్టరేట్ ప్రారంభంతో బైపాస్ రోడ్డు ప్రాంతం పచ్చని హారంగా మారింది. ఐదు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటారు. కొత్త కలెక్టరేట్‌తో ప్రజలకు పాలన మరింత చేరువవుతుందని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.
కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. సభకు సంబంధించి పటిష్ఠమైన ఏర్పాట్లు చేశారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి సహా ఎమ్మెల్యేలు ఏర్పాట్లు పర్యవేక్షించారు. భారీ స్థాయిలో జన సమీకరణ చేసి విజయవంతం చేసేలా ప్రణాళికలు అమలుచేస్తున్నారు. ముఖ్యమంత్రి సభ జిల్లా తెరాస శ్రేణుల్లో నూతనోత్తేజం నింపేలా ఉంటుందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.
మంత్రివర్గం, సీఎల్పీ సమావేశాల తర్వాత పాల్గొంటున్న సభ కావడంతో ముఖ్యమంత్రి ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. కేసీఆర్ రావడంతో పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో నిజామాబాద్ గులాబీమయంగా మారింది.
ఇవీ చూడండి: