తెరాస పాలనలో నిజామాబాద్ జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతోందని నగర మేయర్ నీతూ కిరణ్ పేర్కొన్నారు. నగరంలోని 52వ డివిజన్లో రూ.20లక్షల నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆమె భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు.
వేగంగా అభివృద్ధి..
ఈ కార్యక్రమం అనంతరం పలు డివిజన్లలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. తెరాస పాలనలో నిజామాబాద్ జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపిన మేయర్.. నిజమాబాద్ పట్టణాన్ని చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇంద్రిస్ ఖాన్, స్థానిక కార్పొరేటర్ అస్గర్ బైగ్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'ఆ జర్నలిస్టులకు రూ.3 కోట్ల 56 లక్షలు అందించాం'