ETV Bharat / state

Nizamabad: చిరంజీవి ఆక్సిజన్ కేంద్రం ప్రారంభం - Chiranjeevi Oxygen Center latest news

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చిరంజీవి ఆక్సిజన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి(Collector Narayanareddy) ప్రారంభించారు. కరోనా రోగుల కోసం ఆక్సిజన్ సదుపాయం కల్పించేందుకు హీరో చిరంజీవి ముందుకు రావడం సంతోషంగా ఉందని కలెక్టర్ అన్నారు.

Chiranjeevi Oxygen Center started in Nizamabad district

author img

By

Published : Jun 5, 2021, 4:11 PM IST

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చిరంజీవి ఆక్సిజన్ కేంద్రం(Chiranjeevi Oxygen Center) ప్రారంభమైంది. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్(Chiranjeevi Charitable Trust) ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆక్సిజన్(Oxygen) అవసరం ఉన్న పేదలకు ఉపయోగపడేందుకు ఈ సదుపాయం కల్పించారు.

కరోనా సమయంలో చిరంజీవి(Chiranjeevi) హామీ మేరకు ఆక్సిజన్​ను అందుబాటులోకి తెచ్చారు. ఈ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి(Collector Narayanareddy) ప్రారంభించారు. ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కరోనా రోగుల కోసం ఆక్సిజన్ సదుపాయం కల్పించేందుకు హీరో చిరంజీవి ముందుకు రావడం సంతోషంగా ఉందని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. కరోనా సోకినప్పుడు, లేదంటే కోలుకున్న తర్వాత కొంత మందికి తక్కువ మోతాదులో ఆక్సిజన్ అవసరం ఉంటుంది. అలాంటి వారికి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ అన్నారు.

ఇదీ చూడండి: 'కుటుంబ ఆత్మహత్య అనుమానాస్పద మృతిగా ప్రాథమిక నిర్ధరణ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.