ETV Bharat / state

ఆకలి తీరుస్తున్న స్వచ్ఛంద సంస్థలు.. అధికారుల భద్రతా చర్యలు - సిబ్బందికి నిజమాబాద్​ ఎమ్మెల్యే సెల్యూట్​

నిజామాబాద్​లో లాక్​డౌన్​ కొనసాగుతోంది. రోడ్డు పక్కన నివసించే వారు ఆహారం లేక అలమటిస్తుంటే పలు స్వచ్ఛంద సంస్థలు, హోటళ్ల యజమానులు ముందుకొచ్చి వారి ఆకలి తీరుస్తున్నారు. మరోవైపు నాయకులు, అధికారులు చర్యలు చేపడతున్నారు. జిల్లా అర్బన్​ ఎమ్మెల్యే బిగాల గణేశ్​ గుప్తా కరోనా నివారణపై అధికారులతో సమీక్షించారు. అత్యవసర సేవలందిస్తున్న సిబ్బందిని కొనియాడుతూ సెల్యూట్​ చేశారు.

ఆకలి తీరుస్తున్న స్వచ్ఛంద సంస్థలు.. అధికారుల భద్రతా చర్యలు

author img

By

Published : Mar 27, 2020, 8:39 PM IST

ఆకలి తీరుస్తున్న స్వచ్ఛంద సంస్థలు.. అధికారుల భద్రతా చర్యలు

లాక్ డౌన్ కొనసాగుతున్నందున రోడ్డు పక్కన నివసించే వారికి ఆహారం అందించేందుకు అనేక స్వచ్ఛంద సంస్థలు, హోటళ్ల యజమానులు ముందుకొస్తున్నారు. నిజామాబాద్​లోని రైల్వే స్టేషన్, బస్టాండ్, ప్రధాన కూడళ్ల వద్ద ఉండే అనాథలకు ఆహారం అందిస్తున్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందిస్తూ వారిని ఆదుకుంటున్నారు.

సిబ్బందికి ఎమ్మెల్యే సెల్యూట్​..

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్​ గుప్తా కరోనా వ్యాధి నివారణపై మున్సిపల్, ప్రజారోగ్య, రెవెన్యూ, పోలీస్ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు అందాల్సిన అత్యవసర సేవలు, నిత్యావసర వస్తువులు, శానిటైజర్​లు, మాస్కుల అందుబాటు గురించి అడిగి తెలుసుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సేవలందిస్తున్న సిబ్బందిని కొనియాడుతూ ఎమ్మెల్యే సెల్యూట్ చేశారు. అనంతరం నగరంలో పర్యటించి లాక్ డౌన్ అమలవుతున్న తీరును పరిశీలించారు. నిబంధనల్ని ఉల్లంఘించి రోడ్ల పైకి వస్తున్న వారితో మాట్లాడి తిరిగి పంపించారు. ఫులాంగ్ చౌరస్తా వద్ద కరోనా వ్యాధి గురించి ప్రజలకి అవగాహన కల్పించారు.

ఫోన్​ చేయండి:

నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పర్యటించారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్​ను ఆయన పరిశీలించారు. ఐసోలేషన్ సెంటర్​లో ఏర్పాట్లు, కల్పించిన సౌకర్యాలపై అధికారులతో మాట్లాడారు. ఐసోలేషన్ కేంద్రంలో కావాల్సిన మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే ఫోన్ ద్వారా తెలియజేయాలని నారాయణ రెడ్డి సూచించారు.

ఇదీ చూడండి: కరోనాకు మందు లేదు.. ఓ ఆయుధం ఉంది: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.