నిజామాబాద్ జిల్లాలో బాలుడిని కట్టేసి కొట్టిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం నిజామాబాద్ గ్రామీణ మండలం మల్కాపూర్(ఏ)లో భీమయ్య అనే బాలుడిని అతని పెదనాన్న బాలయ్య తాళ్లతో కట్టేసి ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విషయాన్ని కొందరు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
తల్లి ఫిర్యాదు మేరకు...
ఈ నేపథ్యంలో గ్రామానికి వెళ్లిన పోలీసులు విచారణ చేపట్టారు. తల్లి ఫిర్యాదు మేరకు బాలుడిని కట్టేసి కొట్టిన పెదనాన్న బాలయ్యపై నవీపేట పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. చెప్పిన మాట వినట్లేదని కొట్టినట్లు విచారణలో కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. పనికి రావట్లేదని... బంధువుల అమ్మాయికి వాట్సాప్లో అసభ్య మెసేజీలు పంపిస్తున్నందుకే కొట్టినట్లు కుల పెద్దల పంచాయతీలో బాలయ్య చెప్పినట్లు సమాచారం.