ETV Bharat / state

'మునుగోడులో భాజపా గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా' - మునుగోడు ఉపఎన్నిక ప్రచారం

MLA Shakeel Comments on Moinabad Incident: మునుగోడు ఉపఎన్నికలో భాజపా గెలిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బోధన్​ ఎమ్మెల్యే షకీల్​ సవాల్​ చేశారు. మన ఊరు- మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్​ జిల్లా నవీపేట మండలం నాలేశ్వర్​లో పర్యటించిన ఆయన.. మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్​రెడ్డికి డిపాజిట్​ కూడా దక్కదన్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Oct 27, 2022, 6:24 PM IST

MLA Shakeel Comments on Moinabad Incident: మునుగోడు ఉపఎన్నికలో భాజపా గెలిస్తే.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బోధన్​ ఎమ్మెల్యే షకీల్​ సవాల్​ చేశారు. మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్​ జిల్లా నవీపేట మండలం నాలేశ్వర్​లో పర్యటించిన ఆయన.. మునుగోడులో తెరాస విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి రాజగోపాల్​రెడ్డికి డిపాజిట్ కూడా దక్కదని విమర్శించారు.

తెలంగాణలో తెరాస సర్కార్​ను కూల్చేందుకు భాజపా కుట్ర చేస్తోందని ఆరోపించిన ఎమ్మెల్యే.. భాజపా అక్రమంగా సంపాదించిన డబ్బులతో తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. తమ ఎమ్మెల్యేలు ఎవరూ భాజపాకు అమ్ముడుపోరని ధీమా వ్యక్తం చేశారు.

"తెరాసలో ఎలా అయినా చిచ్చుపెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని భాజపా చూస్తోంది. భాజపా దగ్గర వందలు, వేల కోట్లు ఉన్నాయి. మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలో ఎలా అయితే ప్రభుత్వాలను పడగొట్టిందో.. అలానే ఇక్కడ కూడా భాజపా ప్రయత్నిస్తోంది. తెరాస ఎమ్మెల్యేలకు డబ్బులు ఎరవేసి ఎమ్మెల్యేలను కొనాలని చూస్తోంది. మునుగోడులో తెరాస విజయం ఖాయం.. మునుగోడులో భాజపా గెలిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మునుగోడులో భాజపాకు డిపాజిట్లు కూడా రావు".-షకీల్​, బోధన్​ ఎమ్మెల్యే

'మునుగోడులో భాజపా గెలిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా'

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.