నిజామాబాద్‌లో భాజపా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సమృద్ధిగా వర్షం కురిసినా జిల్లాలోని వేలాది ఎకరాల్లో సోయా విత్తనాలు మొలకెత్తకపోవటం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సోయా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం ఎకరానికి రూ. 30 వేల పరిహారం చెల్లించాలన్నారు. మళ్లీ విత్తుకోవటానికి రైతులకు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం జిల్లా వ్యవసాయాధికారి వాజిద్ హుస్సేన్‌కు వినతిపత్రం అందజేశారు.